‘దేశంలో లాక్ డౌన్ వల్ల వ్యవస్థలన్నీ నిస్తేజమైపోయాయి.. ఆర్ధిక లావాదేవీలు ఆగిపోయాయి.. ప్రజలంతా ఇళ్లకే పరిమితమైపోయారు.. కార్మికులు పనుల్లేక అవస్థలు పడ్డారు..’ ఇవే మనం చూశాం. కానీ.. లాక్ డౌన్ వల్ల ప్రేమికులు కూడా ఇబ్బందులు పడ్డారని ఓ యువకుడు నిరూపించాడు. ప్రేయసితో పీకల్లోతు ప్రేమలో ఉన్న ఆ ప్రియుడు ఎలాగైనా ప్రేయసిని కలవాలనుకున్నాడు. ఎన్నో ఆశలతో ప్రేయసిని చూడాలని ఆ ప్రియుడు చేసిన ఓ కొంటెపనితో పోలీసులకు చిక్కి అరెస్ట్ అయ్యాడు.
రవాణా సౌకర్యాలు లేకపోవడంతో గుజరాత్‌కు చెందిన ఓ యువకుడు తన ప్రేయసిని కలిసేందుకు బైక్ పై బయలుదేరాడు. ప్రేయసి కోసం అంటే పోలీసులు ఆపేస్తారేమోనని చుడిదార్ వేసుకుని, దుప్పట్టా ధరించి, ఫేస్ మాస్క్ తో బయలుదేరాడు. తెల్లవారుఝామున 2.40 గంటల సమయంలో వెళ్తున్న అతనిని అమ్మాయిగానే భావించి వల్సాద్ ప్రాంతంతో పోలీసులు ఆపలేదు. తిరిగి అదే రూట్లో మళ్లీ వెళ్తున్నప్పుడు మాత్రం యువకుడిని అడ్డుకున్నారు. ‘ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నారు’ అని ప్రశ్నించారు పోలీసులు.
గొంతు గుర్తు పట్టేస్తారేమోనని భావించి కేవలం సైగల ద్వారా సమాధానం చెప్పడం మొదలు పెట్టాడు. అనుమానం వచ్చిన పోలీసులు గట్టిగా ప్రశ్నించి దుప్పట్టా తీయాలని కోరడంతో ప్రియుడి అవతారం బయటపడింది. ప్రియురాలిని కలుసుకునేందుకే ఇలా అమ్మాయి వేషంలో వెళ్లానని చెప్పుకొచ్చాడు. దీంతో అతనిపై లాక్ నిబంధనల కింద కేసు నమోదు చేశారు.
12246 828852Hello there! Do you know if they make any plugins to protect against hackers? Im kinda paranoid about losing everything Ive worked hard on. Any suggestions? 920897
959643 262863Youd outstanding guidelines there. I did a search about the field and identified that very likely the majority will agree with your web page. 618519
979783 869592Attractive section of content. I just stumbled upon your blog and in accession capital to assert that I acquire really enjoyed account your weblog posts. Anyway I is going to be subscribing to your augment and even I achievement you access consistently swiftly. 775490