నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ లో నటించిన చిత్రం 18 పేజెస్. సుకుమార్ అందించిన కథ కావడంతో ఈ సినిమాపై సహజంగానే అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దామా.
కథ:
సిద్ధూ టెక్నాలజీకి అడిక్ట్ అయిన వ్యక్తి. చుట్టూ ఉన్న బంధాలు, అనుబంధాలు పెద్దగా పట్టవు. నందిని సిద్ధూకి పూర్తి వ్యతిరేకం. అయితే ఇద్దరూ జీవితంలో ఒకరికి ఒకరు ఎదురుపడరు కానీ నందిని డైరీ సిద్ధూకి దొరుకుతుంది.
లవర్ హ్యాండ్ ఇవ్వడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన సిద్ధూకి నందిని ఆలోచనలు రిఫ్రెషింగ్ గా అనిపిస్తాయి. నందిని ఆలోచనలు అమలుచేయడంతో సిద్ధూ జీవితం పూర్తిగా మారిపోతుంది. అయితే నందిని ని పర్సనల్ గా కలుద్దాం అనుకున్న సిద్ధూకి ఒక పెద్ద ట్విస్ట్ ఎదురవుతుంది. ఏంటది? సిద్ధూ, నందిని కలుసుకున్నారా? లేదా?
నటీనటులు:
ఇప్పటికే నిఖిల్ నటుడిగా తనేంటో నిరూపించుకున్నాడు. కార్తికేయ 2కి పూర్తి భిన్నంగా కనిపిస్తాడు ఈ చిత్రంలో. ఈ చిత్రానికి తన బెస్ట్ ఇచ్చాడు నిఖిల్. అటు ఎమోషనల్ సీన్స్ లో, ఇటు కామెడీ పరంగా కానీ నిఖిల్ ఇంప్రెస్ చేసాడు.
ఈ చిత్రానికి సోల్ అంటే కచ్చితంగా అనుపమ పరమేశ్వరన్. నందిని పాత్రకు అనుపమ పెర్ఫెక్ట్ ఛాయస్ అనిపిస్తుంది. తన పాత్రలో పూర్తిగా ఇమిడిపోయింది.
అజయ్, పోసాని కృష్ణమురళి తదితరులు తమ పాత్రల మేరకు కనిపిస్తారు.
సాంకేతిక నిపుణులు:
సుకుమార్ కథ పూర్తిగా కొత్తది అని అనలేం. డైరీ ద్వారా ప్రేమ కథ అనేది మనం కొన్ని సినిమాల్లో చూసాం. అయితే ఈ చిత్రానికి ఇచ్చిన ట్విస్ట్ కొత్తగా అనిపిస్తుంది. సుకుమార్ అందించిన కథను తనకు చేతనైన రీతిలో బెస్ట్ గా స్క్రీన్ మీదకు తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు పల్నాటి సూర్య ప్రతాప్. మొత్తంగా చూసుకుంటే ఈ చిత్ర కథ, సెటప్ ఎంగేజింగ్ గా అనిపిస్తాయి. అయితే క్లైమాక్స్ మీద చాలానే ఆశలు పెట్టుకుంటే అక్కడ కంగారుగా సినిమాను ముగించిన ఫీలింగ్ వస్తుంది. సెకండ్ హాఫ్ మొత్తంగా ఎమోషనల్ డెప్త్ మిస్ అయింది.
గోపి సుందర్ అందించిన సంగీతం చిత్రానికి మెయిన్ ప్లస్ పాయింట్. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా. సినిమాటోగ్రఫీ ఇంప్రెస్ చేస్తుంది. ప్రొడక్షన్ డిజైన్ కానీ ఎడిటింగ్ కానీ నీట్ గా అనిపించాయి.
ప్లస్ పాయింట్స్:
- కాన్సెప్ట్
- హీరో, హీరోయిన్ల పెర్ఫార్మన్స్
- బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్:
- సెకండ్ హాఫ్
- క్లైమాక్స్
- అనుపమ పాత్ర
విశ్లేషణ:
18 పేజెస్ చూస్తున్నంత సేపూ ఇంకా ఏదో మిస్ అవుతున్న భావన కలిగితే అది ప్రేక్షకుడి తప్పు కాదు. ఒక అద్భుతమైన ప్రేమకథ చూడబోతున్నామన్న ఫీలింగ్ కలిగించి కొంత మేర నిరుత్సాహపరిచారు మేకర్స్. ప్రేమకథలు మీరు ఇష్టపడే వాళ్ళు అయితే ఈ చిత్రంపై ఓ లుక్కేయొచ్చు.
తెలుగు బులెటిన్. కామ్ రేటింగ్: 2.5/5
294169 643960I real delighted to find this internet site on bing, just what I was searching for : D also bookmarked . 572127
789119 575269Thank you for your really great info and feedback from you. car dealers in san jose 759411
324720 29149The Case For HIIT Cardio – Why You should Concider it By the way you might want to look at this cool web site I found 710537