మాతృత్వ మమకారానికి చరమగీతం పాడాడో కొడుకు. కన్నతల్లినే హతమార్చాడు. పైగా.. ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి 15 రోజులపాటు తిన్నాడు. అత్యంత పాశవికమైన ఈ ఘటన స్పెయిన్ లో 2019లో జరిగింది. ఈ కేసు విచారించిన కోర్టు నిందితుడికి 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే..
స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్ లో ఆల్బర్టో సాంచెజ్ గోమెజ్ అనే 28 ఏళ్ల యువకుడు అతడి తల్లి ఓ అపార్ట్ మెంట్ లో నివసిస్తున్నారు. ఆమెను గోమెజ్ హతమార్చాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. ఆపై 15 రోజులపాటు కొంతకొంతగా తినేశాడు. ఇరుగుపోరుగు వారి సమాచారంతో పోలీసులకు విషయం తెలిసింది. దీంతో అప్పట్లోనే గోమెజ్ ను అరెస్టు చేశారు. తనకు ఆ సమయంలో మానసిక స్థితి సరిగా లేదని నిందితుడు కోర్టుకు తెలిపాడు. ఆ సమయంలో తాను సైకాటిక్ పొజిషన్ లో ఉన్నట్టు చెప్పాడు. పూర్తి విచారణ జరిపిన కోర్టు గోమెజ్ కు 15 ఏళ్ల జైలుశిక్ష విధించింది.
434363 82507A lot of writers recommend just writing and composing no matter how bad and if the story is going to develop, you will suddenly hit the zone and itll develop. 594670