Switch to English

ప్రమాదంలో పదమూడన్నర కోట్ల మంది ఉద్యోగాలు?

ప్రపంచాన్ని బేజారెత్తిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా ఓ వైపు ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉండగా.. మరోవైపు కోట్లాది మంది ఉద్యోగాలు కూడా ప్రమాదంలో పడనున్నాయా? భారత్ లో నిరుద్యోగిత రేటు మరింత పెరగనుందా? ప్రముఖ సంస్థ ఆర్థర్ డి లిటిల్ అధ్యయనం ఔననే అంటోంది.

కరోనా వైరస్ భారత ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అనే అంశంపై ఆ సంస్థ ఓ అధ్యయనం నిర్వహించింది. భారత్ లో దాదాపు 13.5 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని అంచనా వేసింది. ప్రస్తుతం 7.6 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు ఏకంగా 35 శాతానికి పెరుగుతుందని పేర్కొంది. మొత్తమ్మీద 17.4 కోట్ల మంది ఉపాధి కోల్పోతారని వివరించింది. ఇది ప్రజల ఆదాయ, వ్యయాలు, పొదుపుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని తెలిపింది. ఈ కారణాలతో దాదాపు 12 కోట్ల మంది పేదరికంలోకి జారిపోతారని, వారిలో 4 కోట్ల మంది అత్యంత దీన స్థితిని ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

భారత ఆర్థిక వ్యవస్థ ఏకంగా లక్ష కోట్ల డాలర్ల మేర నష్టపోయే ప్రమాదం ఉందని, దీనిని నివారించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను ఆ నివేదిక ప్రస్తావించింది. భారత ఆర్థిక వ్యవస్థ రికవరీ ఆంగ్ల అక్షరం ‘డబ్ల్యూ’ ఆకారంలో ఉంటుందని అంచనా వేసింది. అంటే భారత ఆర్థిక వ్యవస్థ గ్రాఫ్ ‘డబ్ల్యూ’ ఆకారంలో ఉండనుందన్న మాట.

ప్రస్తుతం తీవ్ర నష్టాల్లోకి వెళ్లిపోయిన ఆర్థిక వ్యవస్థ.. ఒక్కసారిగా మళ్లీ పైకి ఎగుస్తుంది. అంతా సర్దుకుందిలే అని భావించే లోపే మళ్లీ కిందకు పడిపోతుంది. అనంతరం పైకి వెళ్తుంది. దీనినే ‘డబ్ల్యూ’ ఆకార రికవరీ అని పిలుస్తారు. 1980లో అమెరికా ఇదే విధమైన పరిస్థితి చవిచూసింది. ఆర్థిక సంక్షోభం కారణంగా పాతాళానికి పడిపోయిన అగ్రరాజ్య ఆర్థిక స్థితి, ఏడాదిలోపే పుంజుకుని పైకి ఎగిసింది. మళ్లీ 1981-82లో మరోసారి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రస్తుతం భారత్ కూడా అదే విధమైన పరిస్థితిలో ఉంటుందని ఆర్థర్ డీ లిటిల్ సంస్థ అంచనా వేసింది.

అయితే, ఆర్థికంగా భారత ప్రభుత్వం చేపట్టిన చర్యలు బాగున్నాయని.. ఆత్మ నిర్భర భారత్ పేరిట ప్రకటించిన ప్యాకేజీ సత్పలితాలు ఇచ్చే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ‘మేకిన్ ఇండియా’ నినాదంతో ముందుకెళ్తున్న భారత్.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇదే సరైన తరుణమని పేర్కొంది. అలా చేయడంలో సఫలమైతే 135 కోట్ల జనాభా భవితవ్యం భద్రంగా ఉంటుందని వెల్లడించింది.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

ఫ్లాష్ న్యూస్: లారీ క్యాబిన్‌లో ఉరి వేసుకున్న డ్రైవర్‌

నెలన్నర రోజుల తర్వాత ఎట్టకేలకు లారీలు రోడ్డు ఎక్కాయి. ఈ సమయంలో ఆర్థికంగా డ్రైవర్లు చితికి పోయారు. వారి జీవితం ఆందోళనకరంగా మారింది. ఎంతో మంది ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవతున్నారు. ఆ...

ఫ్లాష్ న్యూస్: ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు, ముగ్గురు మృతి

విజయవాడ, హైదరాబాద్‌ జాతీయ రహదారిపై భారీ యాక్సిడెంట్‌ జరిగింది. నల్లగొండ జిల్లా చిట్యాల సమీపంలో రిలయన్స్‌ పెట్రోల్‌ బంక్‌ సమీపంలో ఆగి ఉన్న ధాన్యం లారీని వెనుక నుండి వచ్చి కారు ఢీ...

దయనీయస్థితిలో బాలీవుడ్ నటుడు

కరోనా నేపథ్యంలో ఇండియాలో పెట్టిన లాక్ డౌన్ వల్ల చాలా మంది ఉపాధి కోల్పోయారు. ఆర్ధిక ఇబ్బందులతో చాలా మంది అల్లాడిపోతున్నారు. వారిలో ప్రముఖ హిందీ నటుడు, మహాభారత్ సీరియల్ లో ఇంద్రుడి...

ఏపీలో మొదటి రోజే వరుస కేసులతో చంద్రబాబుకి షాక్.!

లాక్ డౌన్ కి ముందు హైదరాబాద్ లో ఉండడంతో లాక్ డౌన్ కాలమంతా టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణలోనే ఉండిపోవాల్సి వచ్చింది. దాదాపు 60 రోజుల తర్వాత ఏపీ ప్రభుత్వం...

ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ను బుట్టలో వేసుకున్న దాసు

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అంటే నాకు చాలా ఇష్టం అంటూ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చిన యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ తాజాగా తన అభిమానంను చాటుకున్నాడు. ఎన్టీఆర్‌ పై అభిమానం ఉందని మాటలు...