పాకిస్థాన్, లాహోర్ నుంచి 107 మందితో కరాచీకి బయల్దేరిన పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ కి చెందిన A320 విమానం కరాచీ ఎయిర్ పోర్ట్ దగ్గర్లో కూలిపోయింది. మలిర్ లోని, మోడల్ కాలనీ సమీపంలో జిన్నా గార్డెన్ అనే ఒక రెసిడెన్షియల్ ఏరియాలో విమానం కూలినట్టు సమాచారం. ఈ విమానం కూలడంతో అక్కడున్న 8-10 ఇళ్ళు ధ్వంసం అవ్వడమే కాకుండా భారీగా మంటలు చెలరేగాయి. అక్కడి అగ్నిమాపక దళాలు ఆ భారీ మంటల్ని మరింత వ్యాపించకుండా ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ 107 మందిలో 99 మంది పాసింజర్స్ కాగా, మిగిలిన 8మంది ఫ్లైట్ క్రూ గా చెబుతున్నారు. మరి ఈ 107 మంది చనిపోయారా లేక ఎంతమంది ప్రాణాలతో ఉన్నారు, ఎంతమంది పరిస్థితి విషమంగా ఉంది అనేది తెలియాల్సి ఉంది.
#PIA #ModelColony #MalirCantt #Karachi #Pakistan pic.twitter.com/kk6pGOaWIl
— Yusra Askari (@YusraSAskari) May 22, 2020
14050 406470I love reading through and I believe this website got some genuinely utilitarian stuff on it! . 698957