Switch to English

జ‘గన్‌’ ‘ 151: ఆ ఘనతకు ఏడాది.!

సరిగ్గా ఏడాది క్రితం.. ఇదే రోజున వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయ ఢంకా మోగించింది. రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ల్యాండ్‌ స్లైడ్‌ విక్టరీని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సొంతం చేసుకుంది. వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, ఆంధ్రప్రదేవ్‌లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకిగాను, 151 స్థానాల్లో విజయం సాధించింది. 50 శాతానికి పైగా ఓట్లు సొంతం చేసుకున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, అప్పటిదాకా అధికారంలో వున్న తెలుగుదేశం పార్టీని మట్టికరిపించింది. సుదీర్ఘ కాలం పాటు చేసిన పాదయాత్ర వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి రాజకీయంగా బాగా కలిసొచ్చిందన్నది నిర్వివాదాంశం. అదే సమయంలో, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం చేసిన వ్యూహాత్మక తప్పిదాలూ వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి బోనస్‌ పాయింట్లుగా మారాయి.

మరోపక్క, ‘టీడీపీ – జనసేన’ కుమ్మక్కు అంటూ వైసీపీ చేసిన ప్రచారం ఇటు జనసేనకీ, అటు టీటీడీపీకి కూడా నష్టాన్ని కలిగించాయి. కొన్ని నియోజకవర్గాల్లో జనసేన శ్రేణుల్ని వైసీపీ నేతలు బతిమాలుకుని తమకు అనుకూలంగా ఓట్లేయించుకోవడం గమనార్హం. ఇవన్నీ ఓ ఎత్తు.. రాష్ట్రంలో మద్యం ఏరులై పారింది ప్రలోభాల పర్వంలో భాగంగా. ఒక్కో ఓటుకి గరిష్టంగా 10 రూపాయలు కూడా పంచే పరిస్థితి చాలా చోట్ల కనిపించింది. టీడీపీ – వైసీపీ విచ్చలవిడిగా నోట్లతోనూ, మద్యం బాటిళ్ళతోనూ ఓటర్లను ప్రలోభపెట్టడంపై అప్పట్లో చాలా వీడియోలు కూడా సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అయ్యాయి. అయితే, టీడీపీ నేతలు కొన్ని చోట్ల లోభించడం కూడా ఆ పార్టీ ఘోరంగా దెబ్బతినడానికి కారణంగా చెప్పొచ్చు.

టీడీపీ, జనసేనలనుంచి చివరి నిమిషంలో వలసల్ని ప్రోత్సహించడం ద్వారా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అడ్వాంటేజ్‌ సాధించగలిగింది. ప్రలోభాల పర్వం సహా మిగతా విషయాలన్నీ పక్కన పెడితే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తెరపైకి తెచ్చిన నవరత్నాలు ఓటర్లను విశేషంగా ఆకర్షించాయని చెప్పొచ్చు. ‘ఒక్క ఛాన్స్‌..’ అంటూ వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ అభ్యర్థించడం కూడా 2019 ఎన్నికల్లో కీలక భూమిక పోషించింది. పొరుగు రాష్ట్రం తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన మద్దతు కూడా జగన్ విజయంలో కీలక పాత్ర పోషించింది. మొత్తమ్మీద, రికార్డు స్థాయి విజయం అందుకున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, ఆ విజయానికి ఏడాది పూర్తవడంతో.. ప్రస్తుతం సంబరాల్లో మునిగి తేలుతోంది. కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌ లేకపోయి వుంటే.. ఈ సంబరాలు ఇంకో రేంజ్‌లో వుండేవి.

సినిమా

వీడియో: కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తున్న అల్లు అర్జున్

'అల వైకుంఠపురములో' సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన అల్లు అర్జున్ తన తదుపరి సినిమా 'పుష్ప' సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే టైంకి లాక్ డౌన్...

దేవరకొండ తర్వాత దగ్గుబాటితో ఖరారు?

ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన దర్శకుడు పూరి జగన్నాద్‌ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నాడు. పాన్‌ ఇండియా మూవీగా...

పుకార్లన్నింటికి చెక్‌ పెట్టేందుకు పెళ్లి

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ ఇద్దరు ముగ్గురిని ప్రేమించడం ఆ తర్వాత బ్రేకప్‌ అవ్వడం చాలా కామన్‌ విషయాలు. అయితే సౌత్‌ లో మాత్రం హీరోయిన్స్‌ ఎక్కువ లవ్‌...

ఎట్టకేలకు తిరుమలేషుడి దర్శన భాగ్యం

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోకి భక్తులను అనుమతించని విషయం తెల్సిందే....

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

రాజకీయం

ఆంధ్రప్రదేశ్‌లో ఎవరా ఇసుకాసురులు.. ఏమా కథ.?

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకీ, ఇసుక కుంభకోణాలకీ విడదీయరాని బంధం వుంది. ఏ పార్టీ అధికారంలో వున్నాసరే.. ఇసుక కుంభకోణాలు సర్వసాధారణమైపోయాయి. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మొదలైంది ఈ ఇసుక కుంభకోణాల కథ. చంద్రబాబు హయాంలో...

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఎక్కువ చదివినవి

ఓటీటీ రిలీజ్ : నవదీప్ ‘రన్’ మూవీ రివ్యూ

నటీనటులు: నవదీప్, పూజిత పొన్నాడ, వెంకట్, అమిత్, షఫీ, మధు నందన్, భానుశ్రీ, కిరీటి తదితరులు. నిర్మాతలు: రాజీవ్ రెడ్డి, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం: లక్ష్మీకాంత్ చెన్నా రన్ టైం: 86 నిముషాలు విడుదల తేదీ: మే 29,...

ఇస్మార్ట్ భామకు బాగా బోర్ కొడుతోందిట

ఇస్మార్ట్ శంకర్ తో నభ నటేష్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఆ సినిమాలో నటన పరంగానే కాకుండా వడ్డించిన గ్లామర్ విందుకు యూత్ అంతా ఫిదా అయిపోయారు. ఇస్మార్ట్ శంకర్ నభ కెరీర్...

ట్రంప్‌ అత్యుత్సాహం.. నరేంద్ర మోడీ ఒప్పుకుంటారా మరి.?

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, భారత ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడు. ఎంత గొప్ప సన్నిహితుడంటే, ‘మాకు గనుక హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ట్యాబ్లెట్లను భారతదేశం ఇవ్వకపోతే, మా తడాఖా ఏంటో భారతదేశానికి...

కరోనా పోవాలంటూ నరబలి.. ఓ పూజారి ఘాతుకం

కరోనా వైరస్ పోవాలంటే నరబలి ఇచ్చి దేవతలను సంతృప్తి పరచాలంటూ ఘాతుకానికి పాల్పడ్డాడో గుడి పూజారి. అమానవీయమైన ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలోని కటక్ జిల్లాలోని బందహుడా గ్రామంలో జరిగింది. స్థానిక గుడిలోని...

క్రైమ్ న్యూస్: వేదింపులు భరించలేక భర్తను చంపేసింది

నిజామాబాద్‌ జిల్లా నందిపేట్‌ మండలం దుబ్బ ప్రాంతంకు చెందిన గంధం రమేష్‌ మేస్త్రీ పని చేస్తూ జీవితంను సాగిస్తూ ఉన్నాడు. అతడు ప్రతి రోజు తాగి వచ్చి భార్య పద్మను వేదిస్తూ ఉండేవాడు....