Switch to English

అబ్జర్వేషన్‌: సీఎం జగన్‌.. ఏడాది పాలనకి మార్కులెన్ని.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,468FansLike
57,764FollowersFollow

సంచలన విజయానికి ఏడాది.. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి.. పదవీ ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తయ్యింది. మొత్తంగా 175 సీట్లు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి వుంటే, అందులో 151 సీట్లను వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ కొల్లగొట్టింది. ఇది ఆషామాషీ విజయం కాదు. ఇంతకు ముందెన్నడూ తెలుగునాట లేని విజయం. ల్యాండ్‌ స్లైడ్‌ విక్టరీగా దీన్ని అభివర్ణిస్తారు రాజకీయాల్లో. డబ్బు, మద్యం ప్రభావం.. ప్రత్యర్థులపై దుష్ప్రచారం.. ప్రశాంత్‌ కిషోర్‌ వ్యూహాలు.. లాంటి రాజకీయ విమర్శల సంగతి పక్కన పెడితే, సుదీర్ఘ పాదయాత్ర.. దానికి తోడు ‘ఒక్క ఛాన్స్‌’ అంటూ జగన్‌ అభ్యర్థించడం.. వెరసి వైఎస్‌ జగన్‌ ఏదో చేస్తారన్న ఆశతో జనం ఆయన్ని ముఖ్యమంత్రి పీఠమెక్కించారు.

మరి, ఏడాది పాలనలో జగన్‌ సాధించిన విజయాలేంటి.? అంటే, మ్యానిఫెస్టోని అత్యంత బాధ్యతగా ఆయన అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నించారన్నది నిర్వివాదాంశం. 90 శాతం హామీలు నెరవేర్చేశాం.. అని అధికార పార్టీ నేతలు చెప్పుకోవచ్చుగాక.. అందులో వాస్తవం సగం కూడా లేదన్నది గ్రౌండ్‌ రియాల్టీ. సన్నబియ్యం దగ్గర్నుంచి.. ప్రతి విషయంలోనూ క్వరీలు పెట్టారు. అదే సమయంలో, ప్రజాకర్షక పేర్లతో పథకాలు ప్రకటించి, కొంతమందిని వైఎస్‌ జగన్‌ మెప్పించారన్నది నిర్వివాదాంశం. అయితే, రాష్ట్ర రాజధాని.. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం.. అన్న విషయాన్ని మాత్రం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లైట్‌ తీసుకున్నట్లే కన్పిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని ఏది.? అన్న ప్రశ్న చుట్టూ ఇంకా సందేహాలే.! ఇది వైఎస్‌ జగన్‌ వైఫల్యంగా చెప్పుకోవచ్చు. వ్యూహాత్మకంగా మూడు రాజధానుల అంశం తెరపైకి తెచ్చినా, ఈలోగా అమరావతి అభివృద్ధిని అడ్డుకోవడం ఎంతవరకు సబబు.? అన్న ప్రశ్నకు జగన్‌ ప్రభుత్వం దగ్గర సమాధానమే లేదు. చంద్రబాబు హయాంలో రాజధానికి సంబంధించి కొన్ని భవనాల నిర్మాణం ప్రారంభమయ్యింది. అవిప్పుడు, ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. నిజానికి అది చంద్రబాబు ఆస్తి కాదు.. వైఎస్‌ జగన్‌ ఆస్తి అంతకంటే కాదు. అది రాష్ట్ర ప్రజల ఆస్తి. దురదృష్టవశాత్తూ చంద్రబాబు మీద చూపించాల్సిన ‘కసి’, రాజధాని అమరావతిపై చూపించబడ్తోంది.

ఆంధ్రప్రదేశ్‌.. అంటే ఒకప్పుడు అంతర్జాతీయ స్థాయిలో వున్న పేరు వేరు.. ఇప్పుడు ‘రాజధాని లేని రాష్ట్రమా.?’ అని వెక్కిరింపులు ఆంధ్రప్రదేశ్‌ వాసులకు ఎక్కడికక్కడ ఎదురవుతున్నాయి. పొరుగు రాష్ట్రం తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు వెల్లువలా వస్తోంటే, తెలంగాణ నేల పులకించిపోతోంది. ఆంధ్రప్రదేశ్‌ మాత్రం పోలవరం ప్రాజెక్టు విషయంలో రాజకీయాలు చేస్తూ కూర్చుంది. ప్రత్యేక హోదా గురించి ‘అడుగుతూనే వుంటాం’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చెబుతున్న మాట వెనుక రాజకీయ వైఫల్యం సుస్పష్టం. మొత్తంగా చూస్తే ఏడాది పాలనలో జగన్‌ సర్కార్‌ సాధించిన ఘనతలకంటే వైఫల్యాలే ఎక్కువన్నమాట. పదే పదే న్యాయస్థానాలతో మొట్టికాయలు పడుతున్నా మారని అధికార పార్టీ పెద్దల మొండి వైఖరి.. రాష్ట్ర ప్రజల పాలిట శాపంగా మారుతోంది.

ఈ నేపథ్యంలో రాజకీయ విశ్లేషకులు సైతం, జగన్‌ ఏడాది పాలనకు పాస్‌ మార్కులు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయడంలేదు. విపక్షాలైతే మైనస్‌ మార్కులేస్తాయనుకోండి.. అది వేరే విషయం. ‘ఏడాది పాలనలో చాలా చేశాం.. చంద్రబాబు హయాంలో జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రయత్నించాం.. ఇకపై మా పాలనలో మరింత వేగాన్నీ, గొప్పతనాన్నీ చూడబోతున్నారు..’ అంటోన్న వైసీపీ మాటలే నిజమవ్వాలని ఆశిద్దాం.. అంతకన్నా ఏం చేయగలం.?

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

రాజకీయం

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

జగన్‌కి షాకిచ్చిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు.!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ‘బస్సు యాత్ర’ సందర్భంగా మైండ్ బ్లాంక్ అయ్యింది. అదీ, ఓ విద్యా...

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

ఎక్కువ చదివినవి

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా...

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై దేశవ్యాప్తంగా భారీ...

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని (Naveen Yerneni) పేరు వెలుగులోకి వచ్చింది....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి...

పవన్ కళ్యాణ్ పై రాయితో దాడి

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన 'వారాహి' యాత్రలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ ప్రసంగిస్తుండగా.. గుర్తుతెలియని దుండగుడు ఆయనపై రాయి విసిరాడు. రాయి...