Switch to English

పచ్చని రాష్ట్రంలో చిచ్చు: ‘కడుపు మంట’ చల్లారిందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

దేశంలో ఎక్కడా ఏ జిల్లాకీ అంబేద్కర్ పేరు పెట్టాలనే డిమాండ్ రాలేదు. కేవలం, ఆంధ్రప్రదేశ్‌లో కోనసీమ ప్రాంతానికి మాత్రమే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలనే డిమాండ్ వచ్చిందట.! ఎంత వింత ఇది.? రాష్ట్రంలో కొన్నాళ్ళ క్రితం కొత్త జిల్లాల ఏర్పాటు జరిగింది. ఎన్టీయార్ జిల్లా, అల్లూరి జిల్లా.. ఇలా వ్యక్తుల పేర్లతో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి.

అంతకు ముందు వైఎస్సార్ జిల్లా, పొట్టి శ్రీరాములు జిల్లా.. ఇలా వ్యక్తుల పేర్లతో జిల్లాలున్నాయ్. అన్నమయ్య జిల్లా, సత్యసాయి జిల్లా కొత్తగా ఏర్పాటయ్యాయి. ఆ సమయంలో అంబేద్కర్ జిల్లా.. అని పేరు పెట్టకుండా, ఆ తర్వాత కోనసీమ జిల్లా పేరుని అంబేద్కర్ జిల్లాగా మార్చడం వెనుక అధికార పార్టీ వ్యూహమేంటి.? ఆ వ్యూహం సత్ఫలితాన్నివ్వడం వల్లే ఈ దుస్థితి వచ్చిందా.? లేదంటే, ఆ వ్యూహం బెడిసి కొట్టి పరిస్థితి ఇలా దిగజారిందా.?

సవాలక్ష ప్రశ్నలు ఇలానే తెరపైకొస్తున్నాయి. ఏది నిజం.? ఏది అవాస్తవం.? నిజానికి, ఎవరికీ ఏమీ అర్థం కావడంలేదు. రాష్ట్రానికి రాజధాని లేదు.. అభివృద్ధి ఊసే లేదు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఓ హత్య కేసులో ఇరుక్కుని అరెస్టయ్యాడు.. తానే ఆ హత్య చేశానని ఒప్పుకున్నాడు. ఇంతలోనే, కోనసీమ జిల్లాలో ‘మంట’ చెలరేగింది. ఓ మంత్రిగారి ఇల్లు తగలబడింది. ఓ ఎమ్మెల్యే ఇల్లు కూడా తగలబెట్టేశారు ఆందోళనకారులు.

చిత్రమేంటంటే, చంద్రబాబు హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత మీద జరిగిన కోడి కత్తి దాడిలో నిందితుడు కూడా ఈ కోనసీమ ప్రాంతానికి చెందినవాడే కావడం. ఇదే కోనసీమ ప్రాంతం వున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే రత్నాచల్ ఎక్ప్‌ప్రెస్ రైలుని, కాపు ఉద్యమం సమయంలో ఆందోళనకారులు తగలబెట్టేశారు.

అక్కడ మంట మండుతోంటే, ఆ మంటల్లో చలికాచుకుంటున్న చందాన, ఈ ఘటన వెనుక విపక్షాల కుట్ర వుందని అధికార పార్టీ ఆరోపించడం కొత్త అనుమానాలకు తెరలేపుతోంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలనుకుంటే, కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా ఏ వివాదం లేని చోట ఏదో ఒక జిల్లాకి ఆ పేరు పెట్టి వుండాలి.

అన్ని పార్టీలూ అంబేద్కర్ పేరుని కోనసీమ జిల్లాకి పెట్టాలన్నాయని వైసీపీ చెబుతోంది. మరి, రాజధాని అమరావతికి కూడా అన్ని పార్టీలూ మద్దతిచ్చాయి కదా.! సీపీఎస్ రద్దు చేయాలని అన్ని పార్టీలూ కోరుతున్నాయి కదా.? అంబేద్కర్ పేరుతో రాష్ట్రంలో అత్యంత హేయమైన రాజకీయం జరుగుతోంది. ఈ రాజకీయానికి తెరవెనుకాల స్కెచ్ వేసిందెవరు.? రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చి రాజకీయ లబ్ది పొందాలనుకుంటున్నదెవరు.?

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు...

రాజకీయం

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...

Kannappa: ‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. స్వాగతం పలికిన టీమ్

Kannappa: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమాకు ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు,. ఇప్పటికే రిలీజ్...

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని (Naveen Yerneni) పేరు వెలుగులోకి వచ్చింది....

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

పవన్ కళ్యాణ్ ఆవేశంలో నిజాయితీ, ఆవేదన మీకెప్పుడర్థమవుతుంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నిన్న తెనాలిలో ‘వారాహి యాత్ర’ నిర్వహించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత...