వర్రా రవీంద్రా రెడ్డి.. ఈ పేరు సోషల్ మీడియాలో చాలామందికి తెలుసు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఇతని పేరు మార్మోగుతుంటుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడని చెబుతుంటారు. సోషల్ మీడియా వేదికగా అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేయడంలో దిట్ట ఈ వర్రా రవీంద్రా రెడ్డి.
వైఎస్ జగన్ సతీమణి భారతికి కూడా అత్యంత సన్నిహితుడు, ప్రధాన అనుచరుడు.. అనే గుర్తింపు వుంది వర్రా రవీంద్రా రెడ్డికి. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపైనా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీదా.. అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యల్ని సోషల్ మీడియా వేదికగా వర్రా రవీంద్రా రెడ్డి చేస్తుండేవాడు.
మరీ ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుటుంబాల్లోని మహిళల గురించి హీనాతి హీనమైన కామెంట్లు చేస్తుంటాడు వర్రా రవీంద్రా రెడ్డి. అతని మీద గతంలోనే పోలీసులకు పలు ఫిర్యాదులు అందాయి. అప్పట్లో వైసీపీ అధికారంలో వుండేది గనుక, వర్రా రవీంద్రా రెడ్డిని పోలీసులు ‘టచ్’ చేయలేకపోయారు.
ఇప్పటికీ వర్రా రవీంద్రా రెడ్డిని పోలీసులు టచ్ చేయలేకపోయారంటే, అతనికి వున్న పలుకుబడి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక, శ్రీరెడ్డి గురించి అందరికీ తెలిసిందే. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఆమె విర్రవీగిపోతుండేది సోషల్ మీడియాలో.
ఆ శ్రీరెడ్డి మీద తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారో వ్యక్తి. పోలీసులు కేసు నమోదు చేసి, శ్రీరెడ్డిని అరెస్టు చేస్తారా.? అంటే, వర్రా రవీంద్రా రెడ్డినే అరెస్టు చేయలేదు.. అలాంటిది, శ్రీరెడ్డిని పోలీసులు అరెస్టు చేయగలరా.? అన్న చర్చ జనాల్లో జరుగుతోంది.
వాస్తవానికి ఇలాంటోళ్ళను సభ్య సమాజంలో అస్సలు తిరగనీయకూడదు. దురదృష్టమేంటంటే, ఇంకా వీళ్ళు సమాజంలో విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు. ఫిర్యాదులు అందుతున్నా, పోలీసులు ఎందుకు వీళ్ళను అరెస్టు చేయడంలేదన్నది ఓ మిలియన్ డాలర్ క్వశ్చన్.
గతంలో అయితే, చిన్నపాటి కామెంట్లకే రాత్రికి రాత్రి పోలీసులు అరెస్టులు చేసెయ్యడం చూశాం. సమాజం ప్రశాంతంగా వుండాలంటే, తప్పదు.. ఇలాంటి సంఘ వ్యతిరేక శక్తులపై పోలీసులు ఉక్కుపాదం మోపాల్సిందే.