అప్పుడే గేమ్ ఛేంజర్ హవా మొదలైంది. మొన్న వచ్చిన టీజర్ కు కూడా భారీగా రెస్పాన్స్ వస్తోంది. పైగా ఇందులో ఎన్నడూ కనిపించని విధంగా రామ్ చరణ్ ఓల్డ్ గెటప్ లో కనిపించబోతున్నాడు. టీజర్ లో ఆయన పాత్రల తీరు కూడా ఆకట్టుకుంటోంది. దాంతో గేమ్ ఛేంజర్ మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు. రామ్ చరణ్ నుంచి చాలా కాలం తర్వాత వస్తున్న ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల విషయంలో ఓ ట్రెండ్ నడుస్తోంది. అదే రెండు ట్రైలర్లు. ఒకటి ఫ్యాన్స్ ట్రైలర్, ఇంకొకటి రిలీజ్ ట్రైలర్. మొన్న దేవర మూవీకి, కల్కి సినిమాలకు కూడా ఇలాగే రెండు ట్రైలర్లు రిలీజ్ చేశారు. దాంతో జనాల్లో బజ్ భారీగా ఏర్పడింది. ప్రేక్షకుల్లో ఆ మూవీ పట్ల ఇంట్రెస్ట్ ను పెంచేందుకు ఇది ఉపయోగపడుతోంది. కాబట్టి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ విషయంలో కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతారని తెలుస్తోంది. ఇప్పటికే ట్రైలర్లను కట్ చేసే పనిలో పడ్డారంట డైరెక్టర్ శంకర్. మొదటి ట్రైలర్ లో ప్రైమరీగా చూపించాలని ఫిక్స్ అయ్యారు.
రెండో ట్రైలర్ లో కొన్ని హింట్స్ ఇచ్చి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచబోతున్నట్టు సమాచారం. టీజర్ ఈవెంట్ నే ఓ రేంజ్ లో చేశారు. ఇక ట్రైలర్ లాంచ్ ను దేశ వ్యాప్తంగా చర్చ జరిగేలా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.